ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గంజాయి స్మగ్లర్ల చేతుల్లో చిక్కుకున్న నిరుద్యోగ యువత భవిష్యత్తు
జనసేన వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ రాకెట్ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్ధిక అంశం. విశాఖ మన్యం నుంచి తుని వరకూ ఉపాధి లేని,చదువు పూర్తయిన ,కుర్రాళ్ళు ఈ ట్రేడ్ లో చిక్కుకుంటున్నారు. కింగ్ పిన్స్ మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు అన్నారు పవన్‌కళ్యాణ్
మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉంది. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుంది. అపుడు ఇంకా ఎక్కువ బయటకు వెళ్తుంది. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారు. ఆ పని వదిలి. బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారు. ఇక్కడ సీజ్ చేసినదాని కంటే,రాష్ట్రం దాటిపోతున్న సరుకు ఎక్కువగా ఉంటుంది అన్నారు పవన్‌కళ్యాణ్
ఇటీవల ఢిల్లీ పోలీసులు కూడా భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారని, తదుపరి విచారణలో అది ఏపీలోని విశాఖపట్నం నుంచి వచ్చిందని వెల్లడించారు.
ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో కొన్ని బలమైన శక్తుల మాఫియా వలలో యథేచ్ఛగా సాగవుతున్న గంజాయి ని ఆపాలని, అంతర్రాష్ట్ర టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గంజాయి సాగుని గంజాయి రవాణాని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు పవన్‌కళ్యణ్
Comments