అర్హులైన ప్రతీ ఒక్క జనసైనికుడు ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి
అర్హులైన ప్రతీ ఒక్క జనసైనికుడు ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి...
ఓటు నమోదు చేసుకోవడానికి,
ఓటర్ ఐడి లో మార్పులు చేసుకోవడానికి రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. కావున అర్హులైన జనసైనికులందరూ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా మనవి. మీ పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసిన జనసైనికులు కూడా ఓటు నమోదు చేసుకునేలా ప్రభావితం చెయ్యండి. ఓటు అనే వజ్రాయుధంతోనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం, నవ సమాజాన్ని నిర్మించుకోగలం.

ఓటు నమోదు చేసుకోవడం లేక ఇతర మార్పుల కొరకై క్రింద పద్ధతిని అనుసరించగలరు.
ఫారం నెం - 6 :
ఓటర్ల జాబితాలో పేరును చేర్పించడానికి దరఖాస్తు నమూనా (ఫారం నెం - 6) :
* 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులను క్రొత్తగా ఓటర్ల జాబితాలో చేర్పించడానికి.
* ఒక నియోజకవర్గ పరిధిలో ఓటర్ల జాబితాలో పేర్లు వుండి ప్రస్తుతం వేరే నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న ఓటర్ల తమ ఓటును పాత జాబితాలో తొలగించి క్రొత్తగా నివాసం ఉంటున్న నియోజకవర్గ పరిధిలోకి మార్పించుకోవడానికి.
* ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన వారిని ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేయుటకు ఫారం నెం.6 ని ఉపయోగించాలి.
Form 6
ఫారం నెం - 7 :
Form 6
ఫారం నెం - 7 :
ఓటర్ల జాబితాలో పేరును తొలగించడం కోసం దరఖాస్తు (అభ్యంతరం లేదా తొలగించడం) (ఫారం నెం - 7)
* అనర్హులైన వారి ఓట్లు గాని, ముఖ్యంగా అధికారం అడ్డుపెట్టుకుని అధికారులను బెదిరించి, జిమ్మిక్కులు చేసి అనర్హులైన వారిని, వేరే ప్రాంతాల వారిని ఓటర్లుగా చేర్పించడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తుంది. అట్టివాటిని తొలగించటానికి లేదా అభ్యంతరం చేసే దానికి ఫారం నెం - 7 ను ఉపయోగించాలి.
Form 7
ఫారం నెం - 8 :
ఓటర్ల జాబితాలో చేర్చిన వివరాలు సవరించుట గురించి దరఖాస్తు (ఫారం నెం - 8)
ఓటర్ల జాబితాలో వివరాలు కానీ, ఫోటో కానీ తప్పుగా ఉన్నట్లయితే అట్టి వారి పేర్లు ఓటర్ల జాబితాలో తొలగించబడతాయి. కావున, ఓటర్ల జాబితాలో వివరాలు తప్పులు ఉంటే ఫారం నెం - 8 ద్వారా సవరించుకోవాలి.
Form 8
ఫారం నెం - 8A :
ఓటర్ల జాబితాలో పేరును నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ బూత్ నుండి వేరొక పోలింగ్ బూత్ పరిధిలోకి మార్చుట కొరకు దరఖాస్తు(ఫారం నెం - 8A)
ఒక నియోజకవర్గానికి చెందిన ఒక పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలో పేరు వుండి, నివాసం వేరే పోలింగ్ బూత్ పరిధిలో ఉన్నట్లయితే అట్టి వారిని ఫారం 8A ద్వారా ఓటరు ఎక్కడ నివాసం ఉంటే అక్కడ వున్న పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్ల జాబితాలోకి మార్పించుకునే అవకాశం వుంది. ఫారం 8A ద్వారా ఇట్టి మార్పులు చేసుకోవాలి.
Comments