శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గురువారంనాడు మరోసారి ఆపరేషన్ జరిగింది.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి కంటికి ఆపరేషన్ గత కొన్ని నెలలుగా కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గురువారంనాడు మరోసారి ఆపరేషన్ జరిగింది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల "సెంటర్ ఫర్ సైట్ " కంటి ఆస్పత్రిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి కంటికి ఆపరేషన్ జరిగింది.
నేత్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ సంతోష్ జి. హోనావర్ ఆపరేషన్ నిర్వహించారు. డాక్టర్ జి. వి. ఎస్. ప్రసాద్ ఆపరేషన్ కు కావలసిన అవసరాలను పర్యవేక్షించారు.
డాక్టర్ జి. వి. ఎస్. ప్రసాద్ ఆపరేషన్ కు కావలసిన అవసరాలను పర్యవేక్షించారు. గత నాలుగు నెలలుగా కంటి సమస్యతో బాధపడుతుండగా నెల రోజుల కిందట ఆపరేషన్ నిర్వహించారు. అయితే తగినంత విశ్రాంతి తీసుకోకపోవడంతో కంటికి ఇన్ ఫెక్షన్ అయ్యింది.
దీంతో డాక్టర్ల సలహా మేరకు ఈ రోజు మరోసారి ఆపరేషన్ జరిగింది. తగినంత విశ్రాంతి తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి డాక్టర్లు సూచించారు.


Comments